Telangana Congress spokes person Addanki Dayakar fired at Telangan CM K Chandrasekhar Rao and bjp.
#AddankiDayakar
#BJP
#TRS
#KCR
#Narendramodi
#Rahulgandhi
#congress
#telangana

ఔరంగజేబు కంటే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పెద్ద నియంత అని తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం కాంగ్రెస్ వేసిన భిక్షేనని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ కోసం చేసిన త్యాగాల వల్లే ఈ రోజు వారు పదవులు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌కు ప్రజలంటే లెక్కలేదని.. ఒకే రోజు సమగ్ర సర్వే పేరుతో నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆ రోజు అందుబాటులో లేకుంటే లెక్కలో లేనట్లేనా? ఇది ఫాసిస్టు విధానం కాదా అని ప్రశ్నించారు. కనీసం 2,3 రోజుల సమయం కూడా ఇవ్వారా అని అడిగారు. తెలంగాణలో ఇంతకుముందు విధానాలు, నిబంధనలు లేనట్లుగా కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు.